సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు: సీఎం రేవంత్

TG: లైఫ్‌ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం మాట్లాడుతూ.. 'సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోవద్దు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వైద్యులు అధునాతన సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరవొద్దు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్