పిల్లల హత్యకేసులో కొత్తకోణం.. క్షుద్రపూజల కోసమేనా?

హర్యానాలో ఇటీవల వెలుగుచూసిన పిల్లల హత్యల కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నిందితురాలు పూనమ్‌ను సైకోపతిక్ సీరియల్ కిల్లర్‌‌గా అభివర్ణిస్తున్న క్రమంలో.. పిల్లల హత్యలకు, క్షుద్రపూజలకు సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పూనమ్ రెండేళ్లలో నలుగురు పిల్లల్ని నీటిలో ముంచి చంపగా.. వారు చనిపోయిన రోజులు ఏకాదశి అని బంధువులు ఆరోపించారు. బాధితుల్లో ఒకరి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబంలో ముగ్గురి హత్యలు ఏకాదశి రోజున జరిగినట్లు తెలిపారు. అందులోనూ అన్నీ ఒకేరకంగా జరిగాయని, ఇదేదో కుట్రపూరిత కార్యకలాపాలను సూచిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్