ఫ్రాన్స్‌కు చెందిన మహిళలో అరుదైన బ్లడ్ గ్రూప్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. 15 ఏళ్ల పరిశోధన తర్వాత దీనికి 'గ్వాండా నెగెటివ్' అనే పేరు ఇచ్చారు. ఇది 48వ బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఈ గ్రూప్ ఉన్న ఏకైక వ్యక్తి ఆమెనే. తల్లిదండ్రుల నుంచే ఈ అరుదైన జన్యువు వారసత్వంగా వచ్చింది. ఇతర గ్రూప్‌లతో మ్యాచ్ కాకపోవడం, విభిన్న యాంటీబాడీలు ఉండటం దీని ప్రత్యేకత. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సైన్స్‌లో ఇది కీలక ముందడుగు.