కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మే 30న కర్ణాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి రేసులో డీకే శివ కుమార్, పరమేశ్వర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.