టాలీవుడ్ టికెట్ ధరలపై కొత్త కమిటీ ఏర్పాటు

టాలీవుడ్‌లో సినిమా టికెట్ ధరలు, థియేటర్లలో రెవెన్యూ పంపిణీ విధానంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఈ అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ ధరలు, పర్సెంటేజ్ విధానంపై చర్చించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో కొత్త మార్గదర్శకాలు రూపొందే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్