కొత్త కోవిడ్ వేరియంట్ 'సికాడా' (BA.3.2) ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ కి చెందిన ఈ వేరియంట్‌కు 70కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నాయి. అమెరికాతో సహా పలు దేశాల్లో బయటపడిన ఈ వైరస్ లక్షణాలు పాత ఒమిక్రాన్ మాదిరిగానే ఉన్నాయి. అయితే, ఇది పాత వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరం అనడానికి ఆధారాలు లేవు. భారతదేశంలో ఇంకా ఈ వేరియంట్ కేసులు నమోదు కాలేదు. ఆరోగ్య సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. టీకాలు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.