ఢిల్లీలో కొత్త EV పాలసీ.. పెట్రోల్ బైకులు బ్యాన్!

ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ ఆటోమొబైల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో, రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్తో నడిచే 2, 3 చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్లను నిషేధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తులో EVలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా, రూ. 30 లక్షల లోపు ధర కలిగిన EV కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. EV 2, 3 చక్రాల వాహనాల కొనుగోలుపై రూ. 10,000 నుండి రూ. 50,000 వరకు సబ్సిడీ కూడా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్