హెచ్-1బీ వీసాలో మరోసారి మార్పులు

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు హెచ్-1బీ వీసా ఫీజుల విషయంలో కొత్త నిబంధనలు రానున్నాయి. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) రూపొందించిన ప్రతిపాదనకు ఓఐఆర్ఏ క్లియరెన్స్ ఇచ్చింది. దీని ప్రకారం, విదేశీ ఉద్యోగులను నేరుగా తెచ్చుకుంటే లక్ష డాలర్లు కట్టాలనే నిబంధనతో పాటు, అంతర్గత వీసాల ఫీజులను కూడా పెంచే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం లోకల్ ఉద్యోగాలను కాపాడటానికే ఈ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా, చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕