తెలంగాణలో ఆయిల్‌పామ్ గెలల ధరల నిర్ణయానికి ప్రభుత్వం కొత్త ఫార్ములాను రూపొందించింది. నికర క్రూడ్ పామ్ ఆయిల్ వెయిటెడ్ యావరేజ్ ధరలో 14.76 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే 2025-26 ఆయిల్ ఇయర్లో అప్పారావుపేట ఫ్యాక్టరీ సాధించిన 19.62% సగటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియోను ప్రాతిపదికగా తీసుకుంటారు. పామ్ నట్ రికవరీకి 10.10% వెయిటెడ్ యావరేజ్ ధరలో 75.12 శాతాన్ని లెక్కిస్తారు. ఈ రెండు అంశాల ఆధారంగా రైతులకు గెలల ధర చెల్లించనున్నారు.