మహారాష్ట్రలోని నాసిక్‌లో 27 ఏళ్ల అనికేత్ బాలసాహెబ్ జగ్తాప్ తన భార్య, అత్తమామల మానసిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో అనికేత్ భార్య శ్రుతి, అత్త, మామ, పినతల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రుతి తల్లిదండ్రులను అరెస్ట్ చేయగా, శ్రుతి, పినతల్లి పరారీలో ఉన్నారు. పెళ్లయినప్పటి నుండి శ్రుతి అనికేత్‌తో కలిసి జీవించడానికి నిరాకరించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనికేత్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.