SBI కార్డ్ తన ఫోన్‌పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం, పర్పుల్ కార్డుపై ఇన్సూరెన్స్ బిల్లులకు నెలకు 250 పాయింట్లు, ఇతర లావాదేవీలకు 750 పాయింట్లు లభిస్తాయి. ఆన్‌లైన్ ఖర్చులపై పాయింట్లు 1000 నుంచి 750కి తగ్గాయి. బ్లాక్ కార్డుపై ఇన్సూరెన్స్ బిల్లులకు 500 పాయింట్లు, మిగిలిన వాటికి 1500 పాయింట్లు వస్తాయి. ఆన్‌లైన్ ఖర్చులపై పాయింట్లు 2000 నుంచి 1000కి తగ్గాయి. టోల్, గిఫ్ట్‌లు, బంగారం, ఎడ్యుకేషన్, ఇతర ప్లాట్‌ఫామ్‌లపై యూపీఐ చెల్లింపులకు రివార్డులు వర్తించవు.