బడ్జెట్ 2026–27లో టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. సహజ ఫైబర్ల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో న్యాచురల్ ఫైబర్ స్కీమ్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. టెక్స్‌టైల్ పరిశ్రమ విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక టెక్స్‌టైల్ ఎక్స్‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ను అమలు చేయనుంది. అలాగే చేనేతలు, హస్తకళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడానికి నేషనల్ హ్యాండ్‌లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్ను కూడా బడ్జెట్‌లో ప్రకటించింది. ఇవి గ్రామీణ ఉపాధి, సంప్రదాయ కళల పరిరక్షణకు దోహదపడనున్నాయి.