TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ-సిటీలో ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మివి (Mivi) నూతన తయారీ కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలో తయారీ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 7.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, తెలంగాణను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.