సంక్రాంతికి విడుదలైన సినిమాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ వారం థియేటర్లలో కొత్త చిత్రాలు సందడి చేయనున్నాయి. 'యుఫోరియా', 'బిగ్‌బాస్' అమర్‌దీప్ నటించిన 'సుమతీ శతకం'తో పాటు పలు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. 'విత్ లవ్' అనే డబ్బింగ్ సినిమా కూడా థియేటర్లలోకి వస్తుంది. ఓటీటీల్లో కూడా పలు హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలైన 'రాజాసాబ్', 'నారీ నారీ నడుమ మురారీ', 'పరాశక్తి', 'సైక్ సిద్ధార్థ', 'నీలకంఠ' వంటివి ఈ వారం ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి.