సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ త్వరలో 'ఇన్‌స్టాగ్రామ్ ప్లస్' పేరుతో కొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకురానుంది. ఈ ప్రీమియమ్ సర్వీస్ ద్వారా యూజర్లు ఇతరులకు తెలియకుండానే వారి స్టోరీలను చూసే అవకాశం కలుగుతుంది. మెక్సికో, జపాన్, ఫిలిప్పైన్స్‌లో ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్షిస్తున్న ఈ ఫీచర్‌లో, స్టోరీలను అదనంగా 24 గంటల పాటు ఉంచుకోవడం, యానిమేటెడ్ సూపర్ లైక్స్ పంపడం వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. దీని నెలవారీ ఛార్జ్ సుమారు రూ.200 వరకు ఉండవచ్చని అంచనా.