తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు!

TG: రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు కొత్తగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులతో పాటు తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులకు కూడా పింఛన్లు అందనున్నాయి. సెర్ప్ రికార్డుల ప్రకారం, ఇప్పటికే గుర్తించిన 1,599 మంది బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్