కొత్త పెన్షన్లు.. నేడే లాస్ట్‌ ఛాన్స్

తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియ నేటి (సెప్టెంబర్‌ 15)తో ముగియనుంది. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. దీంతో అర్హులైన వారు ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయనున్నారు. అక్టోబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕