మే నెల యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు

UPI లావాదేవీల్లో మే నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది మే నెలలో రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2,320 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. వేసవి ప్రయాణాలు, ఐపీఎల్‌ సీజన్‌ తోడవడంతో యూపీఐ లావాదేవీలు పెరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది 19 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 1867 కోట్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య 24 శాతం వృద్ధితో 2320 కోట్లకు చేరింది.

సంబంధిత పోస్ట్