సామాన్యుల రోజువారీ జీవితం, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు బోర్డింగ్ పాస్పై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ అవసరం ఉండదు. అలాగే ఆగస్టు 31తో ITR దాఖలు, LPG ఈ-కేవైసీ గడువులు ముగియనుంది. దీంతో రేపటి నుంచి ఈ-కేవైసీ చేయనివారికి తిప్పలు తప్పవు. అలాగే సెప్టెంబర్లో LPG, పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉండొచ్చు. మరోవైపు టాటా మోటార్స్ కార్ల ధరలు గరిష్ఠంగా రూ.25 వేల వరకు, హ్యుందాయ్ వాహనాల ధరలు 1 శాతం వరకు పెరగనున్నాయి.