ఏఐ మ్యూజిక్ స్టార్టప్ సునో యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇక పద్యాలు, ప్రసంగాలకు కూడా తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఏఐ సాయంతో జోడించుకోవచ్చు. సంగీతంపై శిక్షణ లేని వారు సైతం తమ మాటలు లేదా ఆలోచనలను అందించి సంగీతాన్ని రూపొందించుకునేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. క్రియేటర్లకు ఎంటర్టెయిన్మెంట్ కంటెంట్ రూపొందించడంలో మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యమని సునో సహవ్యవస్థాపకుడు మైకీ షుల్మన్ తెలిపారు.