TG : హైదరాబాద్‌లో యువతను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్ 'థాట్ ప్రొవోకింగ్ నైట్' పేరుతో నిర్వహిస్తున్నారు. దెయ్యాలు, ఆత్మలున్నాయని నమ్మేవారు, సందేహించేవారు, ఆసక్తి ఉన్నవారిని ఒకచోట చేర్చి నిజమైన అనుభవాలపై చర్చించే ఈ కార్యక్రమం గత జనవరిలో ప్రారంభమైంది. వారాంతాల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే పాల్గొనాలి.