అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో కీలక పురోగతి నమోదైంది. ఇరుదేశాలు ‘30-ఫర్-30’ ఫార్ములా కింద సుంకాల తగ్గింపునకు సంబంధించిన జాబితాలను విడుదల చేశాయి. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా నాన్-సెన్సిటివ్ ఉత్పత్తులపై చైనా సుంకాలు తగ్గించనుంది. వరి, మొక్కజొన్న, మాంసం, పాడి ఉత్పత్తులు, సీఫుడ్ తదితరాలు ఇందులో ఉన్నాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే సోయాబీన్స్‌పై 10 శాతం సుంకం కొనసాగనుంది. చైనా ఉత్పత్తుల్లో కొన్ని గృహోపకరణాలు, బొమ్మలు, క్రీడా సామగ్రిపై అమెరికా మినహాయింపులు ప్రకటించింది.