న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్ ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్ 81 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశారు. దీంతో టీమిండియా ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్-A టాపర్‌గా నిలిచింది.

సంబంధిత పోస్ట్