ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. కివీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ టామ్ లేథమ్ 14 పరుగులకు ఔట్ అయ్యారు. 23వ ఓవర్‌లో భారత్ బౌలర్ జడేజా వేసిన రెండో బంతికి లేథమ్ LBWగా పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ రివ్యూకు వెళ్లగా ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో 23.2 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 108/4గా ఉంది.