హోలీ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని (VIDEO)

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను న్యూజిలాండ్‌లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా ప్రజలతో కలిసి రంగులు చల్లుతూ హోలీని ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్