ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, చర్లపల్లి డివిజన్‌లోని మల్లాపూర్ సూర్యనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన కవిత అనే మహిళకు పాప పుట్టిన వెంటనే మృతి చెందింది. ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలోనే పాప మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, డాక్టర్ లేకుండా నర్స్ డెలివరీ చేసిందంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్