కామారెడ్డిలో నవ వధువు ఆత్మహత్య

TG: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనూష (20) అనే నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అనూషకు ఇష్టం లేని వివాహం జరిగిందని, దాని కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్