భర్తతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో నవ వధువు మృతి (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి విషాద ఘటన జరిగింది. భిఖాన్‌గావ్‌లోని పలాసి గ్రామానికి చెందిన సోనమ్ యాదవ్ (19), కృష్ణపాల్ యాదవ్ భార్యాభర్తలు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి విగ్రహం ముందు ఆమె తన భర్తతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సోనమ్‌ కుప్పకూలింది. భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా వారిద్దరికి మే1న పెళ్లైంది.

సంబంధిత పోస్ట్