పెళ్ళైన ఐదు నెలలకే నవవధువు అనుమానాస్పద మృతి!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర తాలూకా హొన్నెనహళ్లిలో విషాద ఘటన జరిగింది. 30 ఏళ్ల నవవధువు రూప తన నివాసంలో ఉరివేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. ఐదు నెలల క్రితమే మునిరాజు అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. అయితే, భర్తకు ఉన్న మితిమీరిన అనుమానమే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో రూప పుట్టింటి వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్