దేశ రాజధాని ఢిల్లీలో నవవధువు అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. పుష్ప్ విహార్‌కు చెందిన 28 ఏళ్ల ఆకృతి ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం చేసుకుంది. పెళ్లైన రెండు నెలల్లోనే ఆమె భవనం పైనుంచి కిందపడి మృతి చెందడం పలు అనుమానాలకు దారితీసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, భర్త, అత్తమామలే అదనపు కట్నం కోసం ఆమెను వేధించి హత్య చేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది ఆత్మహత్యా, ప్రమాదమా లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.