పెళ్లింట విషాదం.. తండ్రీకొడుకు మృతి

TG: హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఇంట్లో నవ వరుడు, అతడి తండ్రి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. హసన్‌పర్తి(M) బీమారానికి చెందిన సాంబయ్య-రమాదేవి దంపతుల చిన్న కుమారుడు శరత్‌కు నాలుగు రోజుల క్రితం నగరంలోని ఓ యువతితో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇంటిపై సమాను సర్దుతుండగా తండ్రీకొడులకు కరెంట్ షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్