తెలంగాణ DGP, CPకి NHRC నోటీసులు జారీ

'పుష్ప-2' ప్రీమియర్స్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ డీజీపీకి, నగర సీపీకి జాతీయ మానవహక్కుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పోలీసులు వల్లే రేవతి చనిపోయిందని న్యాయవాది రామారావు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణకు జరపాలని తెలిపింది. లాఠీ‌ఛార్జ్‌పై 4 వారాల్లో పూర్తి వివరణతో కూడిన నివేదికను ఇవ్వాలని NHRC ఆదేశించింది.

సంబంధిత పోస్ట్