మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్‌తో సహా నిందితులు అందరినీ నిర్దోషులుగా పేర్కొంది. పేలుళ్లలో వారి ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. 2008, సెప్టెంబర్ 29న నాసిక్‌లోని మాలేగావ్‌లో భారీ పేలుడు సంబవించింది. ఈ ఘటనలో 6 మంది మరణించగా.. సుమారు వంద మంది గాయపడ్డారు.