కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని మొత్తం 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. కేరళలోని మలప్పురంలో పేలుడు పదార్థాల స్వాధీనం కేసులో దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. అక్రమ పేలుడు పదార్థాల నెట్‌వర్క్‌పై దృష్టి సారించిన ఎన్‌ఐఏ, ఈ కేసులో కీలక ఆధారాల సేకరణ కోసం విస్తృతంగా సోదాలు చేపట్టింది.