TG: నిమ్స్ ఆస్పత్రి అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లక్ష్మీభాస్కర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని నివాసం సహా 7 ప్రాంతాల్లో సోదాలు చేశారు. కూకట్పల్లి, మణికొండ, పేట్బషీరాబాద్లో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.