కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి మొదటిసారిగా 2018లో కోజికోడ్ జిల్లాలో నమోదైంది. అప్పటి నుంచి 2019, 2021, 2023, 2024, 2025ల్లో కూడా కేసులు వెలుగుచూశాయి. 2025 జూలైలో పాలక్కడ్ జిల్లాలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏడుసార్లు నిఫా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రధానంగా కోజికోడ్, మలప్పురం, పాలక్కడ్, ఎర్నాకులం, కన్నూర్, త్రిస్సూర్ జిల్లాల్లో కనిపిస్తోంది. ప్రతిసారి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది.