ప్రస్తుతం నిఫా వైరస్‌కు ప్రత్యేకమైన మందు కానీ, వ్యాక్సిన్ కానీ లేవు. చికిత్స లక్షణాలను తగ్గించడంపైనే ఆధారపడుతుంది. గబ్బిలాలు తిన్న పండ్లు తినకూడదు, పరిశుభ్రత పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి. ఆసుపత్రుల్లో రోగులను చూసేటప్పుడు మాస్క్, గ్లౌవ్స్ వాడాలి. నిఫా సోకినవారితో సన్నిహితంగా ఉన్నవారిని 21 రోజుల పాటు పర్యవేక్షించాలి. ఇలాంటి జాగ్రత్తలతో వైరస్‌ను నివారించవచ్చు.