నిఫా వైరస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. నిఫా వైరస్ వ్యాపించిన వారిలో 4-14 రోజుల్లో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ఎక్కువైన సందర్భాల్లో మానసిక గందరగోళం, మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్), శ్వాస సమస్యలు, కోమా, మరణం కూడా సంభవించవచ్చు. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.