వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని పోలీసులు అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. రుణాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నేహల్ మోదీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. తనపై జారీ చేసిన నోటీసులను రద్దు చేసేలా అతడు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తాజాగా అతడిని అరెస్టు చేశారు.