మే 7న ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం

కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా చర్యలు, హెలిప్యాడ్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.

సంబంధిత పోస్ట్