యువకుడి దుర్మరణం

హోలీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులను కలవడానికి హైదరాబాద్ నుండి వస్తున్న యువకుడు ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. కుమురంభీం జిల్లా జైనూర్‌ మండలం సోన్‌పటేల్‌ గూడాకు చెందిన గేడం సునిల్‌కుమార్‌(34) హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం హోలీ పండుగ రోజున కుటుంబంతో గడిపేందుకు వస్తుండగా, ఉట్నూరు మండలం హస్నాపూర్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతన్ని ఉట్నూరు ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఎస్సై గుంపుల విజయ్‌ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్