తల్లిపాల విశిష్టత గురించి తెలిపిన సిడిపిఓ

ఆరు నెలలు దాటిన చిన్నారులకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలని ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ సరిత సూచించారు. గురువారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్నారు. తల్లిపాలు చిన్నారులలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విమల, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్