సైకిల్ తొక్కడం వల్ల మంచి ఆరోగ్యం

సైకిల్ తొక్కడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని ఖానాపూర్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు వి. కిషన్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన సైకిల్ తొక్కుతూ సైకిల్ తొక్కడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు సైకిల్ తొక్కాలని కిషన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సైక్లింగ్ ఫౌండేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్