వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మొంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎస్ఐ గొల్లపల్లి అనుష గురువారం తెలిపారు. పోచంపాడు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో నది పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని, కలమడుగు, ధర్మారం, బాదం పెళ్లి, చింతగూడ, తపాలాపూర్, రోటి గూడ, తిమ్మాపూర్ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షం సమయంలో ఇనుప స్తంభాలు, చెట్లు, శిథిలాల దగ్గర ఉండవద్దని, మరో మూడు, నాలుగు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్