బ్యాంకు సేవలతో ప్రజలకు ఖాతాదారులకు మేలు జరుగుతుందని దండేపల్లి మండల ఐకెపి ఎపిఎం బ్రహ్మయ్య, సి ఎఫ్ ఎల్ దండేపల్లి కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. శుక్రవారం దండేపల్లిలోని ఐకెపి కార్యాలయంలో డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. వివిధ బ్యాంకు ఖాతాలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ కేటాయింపులు, డిజిటల్ ఖాతాలు, రుణ సౌకర్యాలు తదితర వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జి. హరీష్, ఏసు, నూతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.