విద్యార్థులలో భౌతిక శాస్త్ర జిజ్ఞాసను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని దండేపల్లి మండల ఎంఈఓ దుర్గం చిన్నయ్య, దండేపల్లి పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ సూచించారు. గురువారం దండేపల్లి పాఠశాలలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. నిత్య జీవితంలో జరిగే అంశాల ఆధారంగా భౌతిక శాస్త్రంపై అవగాహన కల్పించాలని వారన్నారు.