దండేపల్లి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం: హెచ్ఎం

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని దండేపల్లిలోని జడ్పీ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ సూచించారు. సోమవారం ఆ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించి వాటికి రాఖీలు కట్టించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ మొక్కకు, విద్యార్థికి అనుబంధం పెంచేందుకు రాఖీలు కట్టించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్