హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందివ్వాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సిహెచ్ దుర్గాప్రసాద్ సూచించారు. గురువారం దండేపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్ కు వచ్చే సరుకులు నాణ్యతగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ ప్రశాంత్, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.