ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేసుకోవాలని దండేపల్లి మండల హౌసింగ్ ఇలియాస్ అన్నారు. శనివారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల బిల్లులను ఐదు విడతలుగా చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతన్న, కారోబార్ శ్రీనివాస్, తాళ్లపేట ఎంపీటీసీ కంది సతీష్ కుమార్ ఉన్నారు.