ఖానాపూర్ పట్టణంలో మంగళవారం ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్ఐఏ కోర్టు 10 మంది ఆదివాసులకు విధించిన మరణశిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2013 మే 25న బస్తర్ జిల్లా జిరంఘాటి వద్ద జరిగిన దాడిలో 29 మంది మృతి చెందారని, ఈ ఘటనలో 10 మంది ఆదివాసులను నిందితులుగా పేర్కొని 13 ఏళ్లుగా జైల్లో నిర్బంధించారని, 2026 నవంబర్ 16న కోర్టు మరణశిక్ష విధించిందని తెలిపారు. సల్వాజుడుం పేరుతో ఆదివాసులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరిగాయని, సుప్రీంకోర్టు 2011లో సల్వాజుడుంను చట్టవిరుద్ధమని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.